Home  »  TV News  »  Godhavari: శోభనం గదిలో మురళికి షాకిచ్చిన నందు.. ట్విస్టుల మీద ట్విస్టులు!

Updated : Jul 18, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి (Godhavari)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-59లో.. జాను వాళ్ళ అమ్మ శారద, నానమ్మ, జాను ముగ్గురు మాట్లాడుకుంటారు. జానూ మీ అక్క నందుకి మురళితో పెళ్ళి జరిగింది. ఇక లేట్ చేయకుండా కార్యం జరిపించాలని వాళ్ళ నానమ్మ అనగానే నానమ్మా అక్కకి నిన్ననే కదా పెళ్ళి జరిగింది.. ఇంకాస్త టైమ్ ఇద్దామని జాను అంటుంది. సంవత్సరం అయినా తన మనసు మారదు ఈ కార్యం జరిపిస్తే అదే సెట్ అవుతుందని జాను వాళ్ళ నానమ్మ అంటుంది. జాను వాళ్ళ అమ్మ శారద కూడా అడ్డుజెప్తుంది కానీ నానమ్మ ఒప్పుకోకపోవడంతో జాను ఇంకా శారద ఒప్పుకుంటారు. మరోవైపు టైలర్ షాప్ లో మురళి వాళ్ళ అసిస్టెంట్ ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడే మురళి వచ్చి ఏంట్రా ఎంజాయ్ చేస్తున్నావా అని అంటాడు. అదేం లేదన్నా అని అతను అంటాడు. అప్పుడే సూర్య అతని అసిస్టెంట్ తుఫాన్ ని తీసుకొని అక్కడికి వస్తాడు.

మరళి బ్రో కొత్తగా పెళ్ళి జరిగింది ఎందుకు ఇక్కడికి వచ్చావని సూర్య అడుగగా ఇంకేం చేయాలని 
మురళి అంటాడు. ఈ రోజు నీకు శోభనం ఉంది. ఇంట్లో ఏర్పాట్లు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అనగానే మరళి సిగ్గుపడతాడు. ఇక అమెరికా నుండి తెప్పించిన ఒక పర్ఫ్యూమ్ ని మురళికి ఇస్తాడు సూర్య. ఈ రోజు రాత్రి జరగబోయే శోభనానికి నువ్వే డైరెక్టర్, నువ్వే రైటర్, నువ్వే హీరో అని మురళిని సూర్య ఎంకరేజ్ చేస్తాడు. ఇక మురళి ఊహల్లోకి వెళతాడు. ఇక సూర్య అతని అసిస్టెంట్ అంతా కలిసి మురళిని ఆడుకుంటారు. 

మరోవైపు నందుని శోభనం కోసం‌ జాను ఇంకా తన చెల్లి కలిసి ముస్తాబు చేస్తుంటారు. అప్పుడే జాను మీద నందు సీరియస్ అవుతుంది. ఏమైందని అడుగుతుంది . నాకు ఎందుకు ఇప్పుడు ఈ ఏర్పాట్లు అని అనగానే వాళ్ళ నానమ్మ వచ్చి నందుని తిడుతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావ్.. ఎవరైనా శోభనం చేసుకుంటామని అంటారా.. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలని నానమ్మ కోప్పడుతుంది. ‌ఇక నానమ్మని జాను పంపించేస్తుంది. తర్వాత నందుతో జాను మాట్లాడుతుంది. అక్క నేను నీకు చెప్పేదాన్ని కాదు కానీ మురళి బావ చాలా మంచోడు.. నిన్ను బాగా చూసుకుంటాడని జాను చెప్తుంది. ఆగిపోయిందా అని నందు అంటుంది. ఆ తర్వాత జాను ఇంకా వాళ్ళ అమ్మ కలిసి నందుని శోభనం గదిలోకి పంపించేసి వెళ్తారు. ఆ తర్వాత నందు గదిలోకి వస్తుంది. ఏంటి బావ చాలా ఊహలు పెట్టుకున్నట్టున్నావ్.. కానీ అవన్నీ ఊహలుగానే ఉంటాయి.. ఊహలుగానే ఉండాలని మరళితో నందు కోపంగా చెప్తుంది. సరే అని మరళి అంటాడు. ఆ తర్వాత దిండు కింద పర్ఫ్యూమ్ బాటిల్ చూస్తుంది నందు. ఏంట‌ని నందు అడుగగా మా ఫ్రెండ్ ఇచ్చాడు.. అమెరికా నుండి వచ్చిందని అనగానే బాగానే ప్లాన్ చేశావ్.. నువ్వు, జానూ చాలా బాగా నటిస్తారని నందు అనగానే ఏం నాటకాలు నందు అని మరళి అనగానే నాకు నిద్రొస్తుందని నందు పడుకుంటుంది. ఇక ఒక చాప, దిండు, దుప్పటి తీసుకుని నేలపై పడుకుంటాడు మరళి. మరోవైపు సూర్యకి వాళ్ళ అమ్మ వీడియో కాల్ చేస్తుంది‌‌. నేను మాట్లాడను అమ్మ అని సూర్య అనగానే మాట్లాడేశావ్ కదా అని ఆమె అంటుంది. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే సూర్యకి జాను కాల్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.